తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వమని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల కేంద్రంలో పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. కేసీఆర్ హయాంలో రైతులు ధైర్యంగా పంటలు సాగు చేస్తున్నారని ఆయన చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. వ్యవసాయ బావులకు విద్యుత్ మీటర్లు పెట్టే కుట్ర చేస్తోందని హరీష్‌రావు ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.