20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

తెలంగాణ లోని పల్లెలన్నీ బాగుపడి తీరాలి…

రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్టేనని, ప్లానింగ్ ఆఫ్ టౌన్, ప్లానింగ్ ఆఫ్ విలేజ్ అంటే ప్లానింగ్ ఆఫ్ స్టేట్ అన్నట్లేనని సీఎం కేసీఆర్‌ చెప్పారు. వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళిక తయారు కావాలని అధికారులను ఆదేశించారు. ప్రణాళిక ఆధారంగానే డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ కార్డు రూపొందించాలని, దాని ప్రకారమే పనులు జరగాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రులతో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  గ్రామాల్లో కలెక్టర్లు,  డిపిఓ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకం చేశారు. 

గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధి హామీ పథకం, హరితహారం, అడవుల పునరుద్ధరణ, పల్లె ప్రగతి,  గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, రైతుబంధు, రైతు వేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ల ఏర్పాటు, కరోనా, అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో విస్తృతంగా  చర్చ జరిగింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు మార్గదర్శకం చేశారు. అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలన్నారు సీఎం కేసీఆర్. ఇన్ని అనుకూలతలున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే, ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని హెచ్చరించారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు.. అవసరమైన పనులు చేసుకోవడానికి నరేగా పథకాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సూచించారు.  ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా  రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతీ గ్రామం ప్రతీ రోజు శుభ్రం కావాల్సిందేనని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరోటి లేదని స్పష్టం చేశారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలనే విషయంలో స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. దానికి అనుగుణంగానే పనులు చేయాలన్న  ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌.. అన్ని  వివరాలతో కూడిన డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  

కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకుని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలు భర్తీ చేశామన్నరు.  కరోనా  కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతీ నెలా  308 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నదని తెలిపారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల కన్నా తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలకు అదనపు నిధులిచ్చి, ఐదు లక్షల రుపాయలకు చేరుకునేట్లు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.  గ్రామ పంచాయతీలకు 3 వేల 694 కోట్ల రుపాయల ఫైనాన్స్ కమిషన్ నిధులు, 5 వేల 885 కోట్ల రుపాయల నరేగా నిధులతో పాటు 337 కోట్ల రుపాయల పంచాయతీల సొంత ఆదాయం ఉన్నాయన్నరు. అంతా  కలిపితే ఏడాదికి 9 వేల 916 కోట్లు సమకూరుతాయని చెప్పారు.  నాలుగేళ్లలో 39 వేల 594 కోట్లు రుపాయల వస్తాయన్నరు.  నిధులు రాబోయే కాలంలో పెరిగే అవకాశం కూడా ఉందని, నిధులతో ఏ పనులు చేసుకోవచ్చో గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నరు.   

గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా చార్జుడ్ అకౌంట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు.  అప్పులు క్రమం తప్పకుండా  చెల్లించాలన్నరు. ట్రాక్టర్ల లోన్ రీ పేమెంట్ చేయాలని, కరెంటు బిల్లులు ప్రతీ నెలా తప్పక చెల్లించాలన్నరు. 10 శాతం నిధులు హరితహారానికి కేటాయించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. గ్రామ వికాసం కోసం జరిగే చర్యల్లో విస్తృత ప్రజా భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేసిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. గ్రామాల్లో నాలుగు రకాల స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నరు. వర్స్క్ కమిటీ, శానిటేషన్ కమిటీ,  స్ర్టీట్ లైట్ కమిటీ, గ్రీన్ కవర్ కమిటిలలో 15 మంది చొప్పున సభ్యులు ఉండేలా చూసుకోవాలన్నరు.  మొత్తం 8 లక్షల 20 వేల 727 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులున్నారు. స్టాండింగ్ కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా  నిర్వహించాలన్నరు. వీరంతా  కలిస్తే ఓ సైన్యం. వీరిని క్రియాశీలం చేస్తే పల్లెల అభివృద్ధి ఉద్యమంలా సాగుతుందని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. 

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...