24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

తొలికాత వచ్చేసింది

  • నేడు యాపిల్‌ పండ్లు కోయనున్న కేంద్రె బాలాజీ
  • రేపు సీఎంకేసీఆర్‌కు అందించనున్న ధనోరా రైతు

కెరమెరి : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం ధనోర గ్రామానికి చెందిన కేంద్రే బాలాజీ పండించిన ఆపిల్‌ పంట తొలికాత చేతికందింది. ఉష్ణ మండల ప్రాంతమైన తెలంగాణలో ఆపిల్‌ పండటం చాలా అరుదు. బాలాజీ ప్రయోగాత్మకంగా ఆపిల్‌పంట సాగుచేశాడు. ప్రస్తుతం ఒక్కో చెట్టుకు 20 నుంచి 40 కాయల వరకు ఉన్నాయి. ఒక్కొక్కటీ 200 నుంచి 250 గ్రాముల బరువు పెరిగాయి. ఇందులో ఏడెనిమిది కిలోల పంట మాత్రమే వచ్చింది. మిగతావి కాయల దశలో ఉన్నాయి. కాగా, ఈ నెల 3న ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ‘తెలంగాణ యాపిల్‌ పండింది’ కథనాన్ని ప్రచురించింది. 

ఈ కథనాన్ని చదివిన ఉద్యానవనశాఖ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి కేంద్రె బాలాజీతో ఫోన్‌లో మాట్లాడి పండ్లు చేతికొచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కల్పిస్తానని హామీ ఇచ్చిన విషయం విదితమే. కేంద్రె బాలాజీ నాటిన 400 మొక్కల్లో ఏడెనిమిది కిలోల పండ్లు చేతికందనున్నాయి. ఇందులో సోమవారం ఓ ఐదు కిలోల పండ్లు కోయనున్నట్లు తెలిపాడు. తొలిసారి కాసిన యాపిల్‌ పండ్లను మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి అందించనున్నట్లు బాలాజీ తెలిపాడు. యాపిల్‌ పండ్లతో పాటు ఓ మొక్కను కూడా ముఖ్యమంత్రికి బహూకరించనున్నట్లు బాలాజీ పేర్కొన్నారు. కాగా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ యాపిల్‌ పండ్లు మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశమున్నది.

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...