24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

దీపావళి పండుగపై కరోనా ఎఫెక్ట్

కరోనా మహమ్మారి దీపావళి పండుగపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీపావళి సందర్భంగా పటాకుల అమ్మకాలు, కాల్చడంపై చాలా రాష్ట్రాలు ఆంక్షలను అమలు చేస్తుండగా.. చలికాలంలో కరోనా వైరస్‌ మరింత విస్తరించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీపావళి కాలుష్యం కరోనా రోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. కరోనా వైరస్‌ శ్వాసకోశాలకు చేరితే ముప్పు తీవ్రత అధికంగా  ఉండే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు

ముఖ్యంగా దీర్ఘ కాలిక వ్యాధి సంబంధిత రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పటాకుల నుంచి వచ్చే కాలుష్యంతో అనారోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రతియేట వాయు కాలుష్యం ఉధృతి పెరుగుతూ వస్తోందని చెబుతున్నారు. కరోనా లక్షణాలు లేని వారిపై కూడా కాలుష్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు..  

మనదేశంలో దీపావళికి ముందు తర్వాత కాలుష్యం తీవ్రతపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిగాయి. బాణసంచా కాల్చిన తర్వాత సూక్ష్మ ప్రమాదకర ధూళి కణాలు కూడా సాధారణ రోజుల కంటే దీపావళి రోజుల్లో దాదాపు మూడింతలు పెరగడం గమనార్హం. గాలిలో నాణ్యత సూచి 0.50 పాయింట్లు ఉంటే స్వచ్ఛమైన గాలి గా పరిగణిస్తారు. అటు  51 నుండి 100 వరకు ఉంటే సంతృప్తికరంగా.. 101 నుండి 200V వరకు ఉంటే మధ్యస్తంగా లెక్కిస్తారు. 201 నుండి 300 వరకు ఉంటే ఆందోళనకరంగా వున్నట్టుగానే భావించాలి. అయితే ఈ ఏడాది పటాకులపై పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తుండటంతో వాయు కాలుష్యం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి..

 మరోవైపు ఇటలీలో తొలిదశ ఉధృతిలో ఎక్కువ మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.  దీనిపై అధ్యయనం చేసిన నిపుణులు.. మధ్య దక్షిణ ఇటలీలో కంటే  ఉత్తర ఇటలీ లో ఎక్కువ మరణాలు సంభవించాయని తేల్చారు. ముఖ్యంగా కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు. ఏళ్లతరబడి కాలుష్యపు ప్రభావానికి గురికావడం వల్ల ముక్కులో కాలుష్యం కారకాలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుందని.. దీంతో కాలుష్యం నేరుగా శరీరంలోకి చేరి రక్తంలోకి ప్రవేశించి ఆరోగ్యం  తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...