19.4 C
Hyderabad
Monday, November 30, 2020

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ కుసర్వం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజ్ లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి టేబుల్కు ఒక మైక్రో అబ్జర్వర్‌ తో పాటు.. మిగత అధికారులు పర్యవేక్షిస్తారు. టేబుళ్ల దగ్గర జరిగే లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణను ఏఆర్వోలకు అప్పగించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, అనంతరం ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 200 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొననున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సహా 23 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఈ నెల 3న.. 315 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం లక్షా 98 వేల 756 ఓట్లు ఉండగా.. లక్షా 64 వేల 192 ఓట్లు పోలయ్యాయి. అంటే 82.61 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1453 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు , 51 సర్వీస్ ఓట్లు పోలయ్యాయి. కాగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం సర్వీస్ ఓట్లు కౌంట్ చేయనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా గెలుపుపై టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాకలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు..
ఇక ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 500 మంది భద్రతా సిబ్బందితో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.