19.8 C
Hyderabad
Monday, November 30, 2020

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న కారు

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు అన్నివర్గాల నుంచి అద్భుత స్పందన వస్తోంది. బతుకమ్మ, దసరా సందర్భంగా దుబ్బాక వైశ్య సంఘం ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజారిటీతో గెలిపించుకుని, సీఎం కేసీఆర్ మనసు గెలుచుకుందామన్నారు మంత్రి హరీశ్ రావు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానన్నారు. అగ్రవర్ణ పేదలకు కూడా సాయం చేస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.  నూటికి నూరు శాతం వైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

రామలింగారెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామన్నారు దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత. నిరంతరం ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రామలింగారెడ్డి అని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దుబ్బాకను మరింత అభివృద్ధి చేస్తానని సోలిపేట సుజాత తెలిపారు. అటు దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవటం ఖాయమన్నారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా.

అటు దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. గులాబీపార్టీలోకి   చేరికల వెల్లువ కొనసాగుతోంది. మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.