23.8 C
Hyderabad
Thursday, October 1, 2020

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా‌రెడ్డి కన్నుమూత

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇక లేరు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి రామలింగారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం కాలికి ఇన్‌ఫెక్షన్‌ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ హైదరాబాద్‌లోని ఓ దవాఖానాలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగానే గుండెపోటు రావడంతో కన్నుమూశారు.

సిద్దిపేట జిల్లాలోని చిట్టాపూర్‌ లో రామలింగారెడ్డి జన్మించారు. మొదట విప్లవోద్యమంలో పనిచేశారు. అనంతరం సుదీర్ఘకాలం వరకు జర్నలిస్టుగా సేవలందించారు. పాత్రికేయ వృత్తిలో పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ తో కలిసి నడిచారు. ఉద్యమకారుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయనకు మొదట్నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి.

2004లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రామలింగారెడ్డి. దొమ్మాట నియోజకవర్గం నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2004లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం దుబ్బాక నియోజకవర్గానికి ఆయన మారారు. 2014 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యే జయకేతనం ఎగరవేశారు. 2018 ఎన్నికల్లోనూ నాలుగోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించారు. రామలింగారెడ్డి ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

రామలింగారెడ్డికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. విప్లవోద్యమంలో పనిచేసిన అనుభవమున్నా.. రామలింగారెడ్డి వ్యక్తిగతంగా చాలా మృదుస్వభావి. నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలందించే నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆ మంచిపేరు వల్లే రామలింగారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...