18 C
Hyderabad
Friday, November 27, 2020

దుబ్బాక ప్రచారంలో కారు స్పీడ్

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గులాబీజెండాల రెపరెపలే కనిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కు అపూర్వ ఆదరణ లభిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు గ్రామగ్రామన జనం ఘనస్వాగతం పలుకుతున్నారు. బతుకమ్మలు, బోనాలతో ప్రచారం విజయయాత్రను తలపిస్తున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున మంత్రి హరీశ్ రావు కూడా ఊరూరా క్యాంపెయిన్ లో పాల్గొంటూ,  గులాబీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు.

దుబ్బాక ప్రచారంలో టీఆర్ఎస్ కు జనం నీరాజనం లభిస్తున్నది. గుడికందుల గ్రామంలో మంత్రి హరీశ్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు గులాబీ నేతలకు ఘనస్వాగతం పలికారు. 

కాంగ్రెస్‌, బీజేపీలు రైతులు, బీడి కార్మికులకు తీరని అన్యాయం చేశాయని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలవి మాటలే తప్ప చేతలేమీ ఉండవని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ తోనే దుబ్బాక అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారాయన. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు ఓ తోబుట్టువులా తోడుంటానని భరోసా ఇచ్చారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు మంత్రి హరీశ్ రావు.

అటు మెదక్‌ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్‌ రోడ్‌ షోకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. మంత్రి హరీశ్‌ రావు, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుజాత ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారంలో ముందుకుసాగారు. కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీలను గెలిపిస్తే దుబ్బాక అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు.

ఇక మెదక్‌ జిల్లా చేగుంట మండల కేంద్రంలో చేగుంట, నార్సింగి మండలాల వర్తక, వాణిజ్య, రైస్‌ మిల్లర్ల సమావేశం జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికలో  టీఆర్ఎస్‌ కు మద్దతుగా నిలవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌ రావు, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, అభ్యర్థి సోలిపేట సుజాత హాజరయ్యారు. వర్తక, వ్యాపారుల కోసం చేగుంటలో భవనం నిర్మిస్తామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

అటు నార్సింగి మండలంలోని  పలు గ్రామాల్లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల జనం స్వచ్చదంగా క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకే ఓటేస్తామంటూ పలు గ్రామాల జనం తీర్మానాలు చేశారు.

టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరపున గులాబీ పార్టీ క్యాడర్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటూ, జనంతో మమేకవుతున్నారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 15వ వార్డ్ లో కౌన్సిలర్‌ పల్లె మీనా రామస్వామి, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుని.. కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...