నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దివ్యక్షేత్రం శర నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. రేపటి నుంచి ఈనెల 25 వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగనున్నాయి. ఈనెల 21న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ఆలంకరించారు. ప్రత్యేక అక్షరభ్యాసం కోసం క్యూలైన్లు, అతిథి గృహాలు, ఉచిత అన్నదాన కేంద్రంతో పాటు.. ప్రసాదం కౌంటర్లకు ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.