భారత్ లో కరోనా విజృంభణకు కళ్లెం పడడం లేదు. దేశంలో బాధితుల సంఖ్య కోటీకి చేరువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 31వేల 118 కరోనా కేసులు వెలుగులోకి రాగా .. మొత్తం కేసుల సంఖ్య 94 లక్షల 62వేల 810 కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్నటికి నిన్న 482 మంది ప్రాణాలు కోల్పోగా..మొత్తం మృతుల సంఖ్య లక్షా 37వేల 621దాటినట్టు తెలిపింది. దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 4 లక్షల 35వేల 603గా ఉండగా.. 88 లక్షల 89వేల 985మంది డిశ్చార్జి అయినట్టు పేర్కొంది ఆరోగ్యశాఖ.