భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 75వేల 083 కేసులు బయటపడగా..ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 55లక్షల62వేల664 కి చేరుకుంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 053 మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 88వేల 935కు చేరింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 44లక్షల97వేల868గా ఉండగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 9లక్షల75వేల861కు చేరింది. ఇక కరోనా రికవరీ రేటు పెరగ్గా, మరణాల రేటు పడిపోయిందని ఆరోగ్య శాఖ తెలిపింది.
