భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతుంది. బాధితుల సంఖ్య 67లక్షలు దాటింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 72వేల 49కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 67లక్షల 57వేల 132కు చేరుకుంది. నిన్నటికి నిన్న 986 మంది మృతి చెందడంతో .. మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 04వేల 555 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 57లక్షల44వేల694కు చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 10లక్షల4వేల555గా ఉంది