భారత్ లో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కేసుల సంఖ్య 59 లక్షల మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్లో 85వేల352 కేసులు నమోదు కాగా..మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య59లక్షల 3వేల933కి చేరాయి. నిన్నటికి నిన్న 1వెయ్యి 89 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 93వేల379 దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9లక్షల60వేల969గా ఉండగా.. 48లక్షల49వేల585 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.