25.4 C
Hyderabad
Monday, July 13, 2020

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రైతులు : మంత్రి జగదీశ్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్ర రైతులు దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నరని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి నేడు వానాకాలం పంటలు, ఎరువులు, విత్తనాల సరఫరా, నియంత్రిత వ్యవసాయ సంసిద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతుల ఉత్పత్తులకు విలువ పెరిగేలా ప్రభుత్వం నియంత్రిత విధానం తెచ్చిందన్నారు. రైతు పండించిన కంది పంటలో ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందన్నారు. నియంత్రిత వ్యవసాయంలో రైతులను సంఘటిత పరచడం మొదటి లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైతాంగాన్ని సంఘటితం చేసి లాభాలు పొందే విధంగా సీఎం కేసీఆర్‌ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. 

రైతులకు 24 గంటల కరెంట్‌, నీళ్లు, ఆర్థిక చేయూత, ఎరువులు, విత్తనాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కానీ మార్కెట్‌లో రైతులు పండించిన పంటలకు ధర నిర్ణయించుకునే పరిస్థితి లేదన్నారు. కాబట్టే రైతులు నష్టపోతున్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ రైతులను ఐక్యం చేయడానికి నియంత్రిత విధానాన్ని ముందుకు తెచ్చారన్నారు. నూతన వ్యవసాయ సాగు విధానాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకుల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నరన్నారు. ప్రభుత్వం చేసే ప్రతీ పనిని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించడం పరిపాటిగా పెట్టుకుందన్నారు. నియంత్రిత విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నాయకులు రైతు వ్యతిరేకులుగా మారారన్నారు.

- Advertisement -

Latest news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

Related news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్‌ లోని నౌగామ్‌ సెక్టార్‌ లోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు...

జపాన్‌లో వరదలు….66మంది మృతి

నేపాల్‌, జపాన్‌ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి.వరదల దాటికి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో...