21.7 C
Hyderabad
Friday, January 22, 2021

దోబీ ఘాట్‌లకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ : సీఎం కేసీఆర్

తెలంగాణ వస్తే.. విద్యుత్‌ కొరత ఏర్పడుతుందని భయపెట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సాధించి చూపించాం. ఒట్టి మాటలు వల్ల ఇది సాధ్యం కాదు. నగరంలో ఇప్పుడు జనరేటర్లు, ఇన్వర్టర్ల బాధ్యత తప్పింది. రజకులకు దోబీ ఘాట్‌లు ఉచిత కరెంటు అందిస్తాం. దోబీ ఘాట్‌లో ఉండే మోటార్లకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. సెలూన్లకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.  

మిషన్‌ భగీరథ వల్ల ఇంటింటికీ నీళ్లు వచ్చినయన్న మాట.. రాష్ట్రంలో ఏ ఇంటికి పోయి.. ఏ ఆడబిడ్డను అడిగినా చెప్తారని ముఖ్యమంత్రి అన్నారు. నగరంలో ప్రతీ ఇంటికి నీటి బిల్లులు రద్దు చేసి.. ఉచితంగా నీరు అందిస్తామని కేసీఆర్‌ తెలిపారు. కులమతాలకు అతీతంగా ఎన్నో పథకాలు తీసుకువచ్చి ప్రజలకు అందిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. నగరంలో ఇప్పడు ఏ బస్తీకి సుస్తీ చేసినా.. అక్కడికక్కడే వైద్యం అందేలా 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...