19.4 C
Hyderabad
Monday, November 30, 2020

ధరణి వెబ్ సైట్ ద్వార భూరికార్డుల డిజిటలైజ్

రైతులకు, భూ యజమానులకు రక్షణ కల్పించే గొప్ప లక్ష్యంతో  సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌.. వేగంగా, పారదర్శకంగా ప్రజాసేవ చేస్తున్నది. అయితే, ఎన్నారై భూములు, కంపెనీల భూములు, ఇటీవల రిజిస్ట్రేషన్లు జరిగిన భూముల మ్యుటేషన్‌, మార్టిగేజ్‌, ఇతర డీడీల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టిసారించింది. ప్రధానంగా ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్లన్నీ ధరణిలో పొందుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ఈసీలతో పాటు, మార్ట్‌గేజ్‌ డీడ్‌ల ఈసీలు, మ్యుటేషన్‌ కాని భూములకు చెందిన డీడీల ఈసీలను కూడా ధరణిలో చేర్చుతున్నది. విక్రయించిన భూమి మ్యుటేషన్‌ కాకపోతే, దాన్ని అవకాశంగా తీసుకొని అదే భూమిని వేరేవాళ్లకు విక్రయించే ప్రమాదం ఉన్నదని గుర్తించిన అధికారులు.. ఈసీలన్నింటినీ ధరణిలో చేర్చాలని నిర్ణయించారు.            

ఇప్పటివరకు జరిగిన క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ఆధారంగా వెంటనే మ్యుటేషన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనున్నది. రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌  చట్టం-2020లోని సెక్షన్‌ 10 ప్రకారం ఏదైనా కారణంతో మ్యుటేషన్‌ జరుగకుండా హక్కు పత్రం కలిగిన పాస్‌పుస్తకం జారీ చేయనప్పుడు సెక్షన్‌ 5 ప్రకారం సేల్‌డీడ్‌, మార్ట్‌గేజ్‌, దానపత్రం, సెక్షన్‌ 6 ప్రకారం ఫౌతి, సెక్షన్‌ 7 ప్రకారం కోర్టు డిక్రీ, వీటిల్లో ఏదో ఒక్క సెక్షన్‌ ఆధారంగా తాసీల్దార్‌ హక్కు పత్రం జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు వర్కింగ్‌ గైడ్‌ లైన్స్‌ రాగానే సెప్టెంబర్‌ 7 నాటికి జరిగిన క్రయవిక్రయాలన్నింటినీ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేసి, వాటిని మ్యుటేషన్‌ చేస్తారు. వీటిని పరిశీలించే అధికారం కలెక్టర్లకు ఇవ్వనున్నట్టు సమాచారం.           

అనేకమంది ఎన్నారైలకు తెలంగాణలో భూములున్నాయి. ప్రస్తుతం వీరు అందుబాటులో లేరు. దీంతో వారి భూములకు ఆధార్‌ అనుసంధానం కాలేదు. కొంతమంది ఎన్నారైలకు ఆ దేశాల పౌరసత్వం ఉన్నది. ఇక్కడి ఆధార్‌ కార్డు లేదు. ఇక్కడి భూములకు వాళ్లు యజమానులైనప్పటికీ ఆధార్‌ అనుసంధానం లేకపోవడం వల్ల పాస్‌పుస్తకాలు రాలేదు. దాంతో క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం ఎన్నారై భూ యజమానుల పాస్‌పోర్ట్‌ను లింక్‌చేసి పాస్‌పుస్తకం జారీ చేయాలని నిర్ణయానికి వచ్చింది. 

ఆధార్‌ సీడింగ్‌ లేకపోవడంతో పలు ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన భూములను ధరణిలో చేర్చలేదు. రాష్ట్రంలో ఉన్న కొన్ని వేల కంపెనీలకు వ్యవసాయ భూములున్నా యి. ఈ భూముల్లో వ్యవసాయం కూడా చేస్తున్నారు. కొన్ని కంపెనీలు సాగు చేయలేక అలాగే వదిలేశాయి. ఇలా వివిధ కంపెనీల పేరున ఉన్న వ్యవసాయ భూములను రైతుబంధు నుంచి మినహాయించడానికి సీసీఎల్‌ఏ పోర్టల్‌లో నాన్‌డీఎస్‌గా మార్క్‌చేశారు. నాన్‌డీఎస్‌గా మార్క్‌ చేసినా క్లియర్‌ టైటిల్‌ ఉన్నందున ఇప్పటివరకు క్రయవిక్రయాలు జరిగాయి. కానీ ధరణిలో ఎంట్రీ చేయలేదు. రైతుబంధు అవసరం లేకున్నా.. రాజ్యాంగంలోని ఇతర హక్కులన్నీ ఇవ్వాల్సి ఉంటుందని సర్కారు భావించింది. కంపెనీ డైరెక్టర్‌ లేదా చైర్మన్‌ లేదా కంపెనీ సూచించే ఆధార్‌ నంబర్‌ ఎంట్రీ చేసి ధరణిలో కంపెనీ పేరు నమోదుచేసి 1(బీ), పాస్‌పుస్తకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.                           

అటు ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన క్షణాల్లోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. బీఆర్కేభవన్‌లోని ధరణి వెబ్‌ సైట్‌ వార్‌రూం సిద్ధమవుతున్నది. 100 మంది సాంకేతిక నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ధరణి వెబ్‌ సైట్‌పై ఫిర్యాదులు, సమస్యలపై 24 గంటలపాటు పనిచేసే కాల్‌ సెంటర్‌ను ఏరాటుచేస్తున్నట్టు తెలిపారు.  ధరణి స్లాట్‌బుకింగ్‌ సమస్యల పరిష్కారానికి 18005994788 నంబర్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 31,767 సభ్యులు అకౌంట్‌ ఏర్పాటు చేసుకున్నారని, ఇందులో 1,686 రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయని సీఎస్  వివరించారు. 4,450 మంది స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారని తెలిపారు. 24 లక్షల మంది ధరణి వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి ఉన్నారని.. ఇందులో భాగంగా తొలిరోజు 442 రిజిస్ట్రేషన్లు, రెండోరోజు 479, మూడోరోజు 765 చొప్పున రిజిస్ట్రేషన్లు పెరుగుతూ వచ్చాయని చెప్పారు. అటు ధరణి పోర్టల్‌లో ఉత్పన్నమవుతున్న ఇబ్బందులు క్రమంగా తొలగుతున్నాయి. సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నారు. సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను నియమించారు. 

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.