21.4 C
Hyderabad
Friday, October 23, 2020

నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి.. చర్యలు తీసుకుంటున్నాం

హైదరాబాద్‌ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.  హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నరు. సనత్‌ నగర్‌ ఆర్ యూబీతో పాటు ఫతేనగర్‌ బ్రిడ్జి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి తలసానితో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

68 కోట్లతో సనత్‌నగర్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాలో ఆర్‌యూబీ నిర్మాణం చేపట్టడం ద్వారా  లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అటు ఫతేనగర్ బ్రిడ్జిని విస్తరించడం ద్వారా ట్రాఫిక్ సమస్య తీరుతుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెండ్ లైన్లుగా  ఉన్న ఫతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని 400 మీటర్ల మేర విస్తరించనున్నారు. దాదాపు రూ.45 కోట్ల నిధులతో నాలుగు లైన్లుగా బ్రిడ్జిని విస్తరిస్తున్నామన్నరు.  హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడానికి ఇప్పటికే పలు ఆర్‌ఓబీలు, ఫ్లై ఓవర్‌ల నిర్మాణం చేపట్టామని, మొత్తం 137 కొత్త లింక్‌ రోడ్లు వేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు.  హైదరాబాద్‌ అభివృద్ధికి  అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్‌ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.  30 యేండ్ల తన రాజకీయ జీవితంలో.. కేటీఆర్‌ లాంటి డైనమిక్‌ లీడర్‌ను చూడలేదని.. మంత్రి తలసాని చెప్పారు.   

సనత్‌ నగర్‌ ఆర్‌యూబీతో పాటు ఫతేనగర్ బ్రిడ్జి విస్తరణతో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.  సనత్‌నగర్‌, బాలానగర్‌ పారిశ్రామిక వాడలను కలుపుతూ.. బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో దాదాపు ఆరున్నర కిలోమీటర్ల దూరం కలిసివస్తుందని.. ఈ మార్గంలో ప్రయాణించే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అటు త్వరలోనే హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.   

- Advertisement -

Latest news

Related news

రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌ రౌండ్‌ పర్‌ఫామెన్స్‌ తో అదరగొట్టింది. ఫ్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక...

రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి…చిరు ట్వీట్

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.  రాజ‌శేఖ‌ర్  ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు. అలానే త‌న తండ్రి...

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఏడవరోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సప్త ఆశ్వాలను కలిగిన సూర్యప్రభపై శ్రీనివాసుడు వజ్రకవచం ధరించి...

బీహార్‌ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌

బీహార్ లో పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డమే...