26 C
Hyderabad
Wednesday, January 27, 2021

నల్లచట్టాలపై గళమెత్తిన మంత్రులు తెలంగాణలో బంద్ సంపూర్ణం

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ నిరసన గళమెత్తింది. రైతు సంఘాల పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం భారత్ బంద్ ను పాటించింది. టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మద్దతు ప్రకటించడంతో తెలంగాణలో బంద్ విజయవంతమైంది. పలువురు మంత్రులు కూడా ఎక్కడికక్కడ నిరసనలతో, అన్నదాతలకు మద్దతుగా బంద్ పాటించారు.

షాద్ నగర్ లోని బూర్గుల గేట్ వద్ద బెంగళూరు హైవే కేంద్రప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. భారత్ బంద్ లో భాగంగా మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్ బెంగళూరు హైవేను దిగ్బంధించారు.  రైతు కంట కన్నీరు దేశానికి మంచిది కాదన్నారు మంత్రి కేటీఆర్‌. కేంద్రం దమననీతికి వ్యతిరేకంగా త్వరలోనే కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు.

భారత్ బంద్ లో భాగంగా  మెదక్ జిల్లా తుప్రాన్  హైవేను మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు దిగ్భందించాయి. నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.  

బంద్ కు మద్దతుగా వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ పోరుబాట పట్టింది. మంత్రి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో కమలాపూర్ లో ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై వంటవార్పు చేసి, నిరసన వ్యక్తం చేశారుకేంద్రం కళ్లు తెరవకపోతే అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదని మంత్రి ఈటెల హెచ్చరించారు.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ టోల్ ప్లాజా వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి రాస్తారోకో నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ సంస్థలు రైతు ఉత్పత్తుల కృత్రిమ కొరతను సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.  

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే రవిశంకర్ తో పాటు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొని, రైతులకు సంఘీభావం ప్రకటించారు. రైతుల గోడును పట్టించుకోకుండా కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

అన్నదాతల పోరాటానికి మద్దతుగా సూర్యాపేటలో హైదరాబాద్విజయవాడ జాతీయ రహదారి నిరసనలతో హోరెత్తింది. మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ శ్రేణులు నేషనల్ హైవేను దిగ్బంధించాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్ని వెంటనే రద్దు చేయాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు

నిజామాబాద్జిల్లా వేల్పూర్రహదారిపై రైతులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బైఠాయించారు. అన్నదాతలతో కలిసి కేందప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ.. ఫ్లకార్డులు ప్రదర్శించారు.  రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకునే వరకు కేంద్రంపై పోరాటం ఆపేది లేదని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. కొత్త చట్టాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించేందుకుకేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ పిలుపుమేరకు మడికొండలో జాతీయ రహదారిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో పాటు వందలాది మంది రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు.

బంద్ కు మద్దతుగా కరీంనగర్ జిల్లా కదం తొక్కింది. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ క్యాడర్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. అనంతరం కరీంనగర్ పట్టణ కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. మోడీ సర్కార్ అన్నదాతల ఉసురుపోసుకుంటోందని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.  

భారత్ బంద్ లో భాగంగా ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి  ధర్నాలో పాల్గొన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రధాని మోడి తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.

రైతాంగ పోరాటానికి మద్దతుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ కడ్తాల్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. వందలాది మందితో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అంతకుముందు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతుంటే.. కేంద్రప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు.

భారత్ బంద్ కు మద్దతుగా మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ తో పాటు పలు చోట్ల  నిరసన చేపట్టారు.  రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని  మంత్రి మల్లారెడ్డి అన్నారు.  

సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి ముషీరాబాద్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పోరాటం ఉదృతం చేస్తామని మంత్రి హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి రహదారిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాస్తారోకో నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వందలాది మంది రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు కీడు తలపెట్టే వ్యవసాయ చట్టాలను అడ్డుకుని తీరుతామని ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు.

బంద్పిలుపులో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కుగుడ దగ్గర శ్రీశైలం జాతీయ రహదారి దిగ్బంధనం చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్తీక్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నదాతల పోరాటానికి తెలంగాణ మంత్రులు, ఇతర ముఖ్యనేతలు  సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రంపై పోరాటాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు.

 అన్నదాతల పోరాటానికి మద్దతుగా మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.

- Advertisement -

Latest news

Related news

మదనపల్లె జంటహత్య కేసు నిందితులకు.. 14రోజుల రిమాండ్

మదనపల్లె జంటహత్యల కేసులో నిందితులైన మృతురాళ్ల తల్లితండ్రులకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడులను పోలీసులు మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కోర్టు నిందితులకు...

ఆకస్మికంగా మార్కెట్‌యార్డుకు సీఎం కేసీఆర్‌

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం అక్కడున్నరైతులతో మాట్లాడారు. పంటల సాగు, ధరలను  అడిగి...

ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన...

ఎన్టీఆర్ కు గాలమేసిన కేజీఎఫ్ డైరెక్టర్

దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సాధించిన కేజీఎఫ్ సినిమాతో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పీడ్ పెంచాడు. కేజీఎఫ్2 పూర్తి కాగానే.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు....