రాష్ట్రంలో నవజాత శిశువుల సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. అసెంబ్లీలో నవజాత శిశువులు, ప్రజారోగ్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మీ పథకం తీసుకొచ్చిన తర్వాత బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయని మంత్రి ఈటెల చెప్పారు. నవజాత శిశువుల సంరక్షణలో దేశంలోనే తెలంగాణ ప్రస్తుతం రెండో స్థానంలో ఉందన్నరు.