నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 2 లక్షల 48 వేల 266 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా..14 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తివేసి 2లక్షల 48వేల 266 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 310 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు అవగా.. ప్రస్తుతం 589.60 అడుగుల మేరకు నీటిమట్టం చేరుకుంది.