24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

నాయిని నర్సింహారెడ్డి మృతిపై పలువురు నేతల దిగ్భ్రాంతి

కార్మిక పక్షపాతి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి మరణం బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్‌ కుమార్  విచారం వ్యక్తం చేశారు. తొలిదశ ఉద్యమం నుంచి రాష్ట్రం, కార్మికుల సంక్షేమం ఆయన పాటుపడ్డారని అన్నారు. నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరనిలోటన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. సీఎం కేసీఆర్ నాయకత్వంలో  తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో నాయిని సేవలు మరువలేనివన్నారు. కార్మిక సంఘాల నేతగా ఎనలేని గుర్తింపు పొందిన నాయిని ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని పార్థించారు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం చాలా దురదృష్టకరమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిమోనియా, లంగ్స్ లో ఇన్ఫెక్షణ్ వల్ల ఆయన చనిపోయారని.. అంత్యక్రియల కోసం సీఎం కేసీఆరే స్వయంగా ఏర్పాట్లు చేయిస్తున్నారని తెలిపారు. నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ భగవంతున్ని ప్రార్థించారు.

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం తీరని లోటని హోం మినిస్టర్ మహమూద్ అలీ అన్నారు. మొదట్నుంచీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని.. ఆనాటి ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ కు అనేక సందర్భాల్లో వెన్నంటి ఉన్నారని చెప్పారు. అలాంటి నాయిని మరణం చాలా దురదృష్టకరమని హోంమంత్రి మహమూద్ అలీ విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...