24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత

ఇటీవల కన్నుమూసిన దివగంత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్యారెడ్డి(64) సోమవారం కన్నుమూశారు. ఈ నెల 21న అర్ధరాత్రి దాటిన తర్వాత నాయిని నర్సింహారెడ్డి మృతిచెందిన సంగతి తెలిసిందే. 22న భర్తను కడసారి చూస్తానంటూ అహల్యారెడ్డి పట్టుపట్టడంతో అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆమెను తిరిగి అపోలోకు తీసుకెళ్లారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఈ నెల 20న జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో చేర్పించారు. ఐసీయూ లో చికిత్స పొందుతున్న ఆమె సోమ వారం సాయంత్రం 7.44 గంటలకు తుదిశ్వాస విడిచారు. నాలుగురోజుల వ్యవధిలోనే దంపతులు కన్నుమూయడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్యారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించినట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...