27.2 C
Hyderabad
Friday, December 4, 2020

నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం: మంత్రి కేటీఆర్

భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో ఆయన మాట్లాడారు. వరదనీటిలోనే నడుచుకుంటూ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వరదతో ఇబ్బంది పడ్డ  ప్రజలందరికీ అండగా ఉంటామని భరోసా నిచ్చారు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా శాశ్వతం పరిష్కారం చూపిస్తామన్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలను తక్షణం తొలగించాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా డ్రైనేజీ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలను మంజూరు చేస్తారు. ఇళ్లలో నీరు నిలిచిన కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్,  పలువురు ప్రజాప్రతినిధులు కూడా కేటీఆర్ వెంట పర్యటించారు.  

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....