19.5 C
Hyderabad
Friday, November 27, 2020

నాలుగు దశాబ్దాలకు గోదావరి మథనం

నాలుగు దశాబ్దాల తర్వాత గోదావరి జలాల పంపిణీ తెరపైకి వస్తోంది. ఎట్టకేలకు కేంద్రం గోదావరిపై నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ, ఏపీలకు స్పష్టతనిచ్చింది. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుతూ లేఖ రాయాలని జలశక్తి శాఖ  రెండు రాష్ట్రాలను కోరింది. ట్రిబ్యునల్ ఏర్పాటుతో గోదావరి నదిలో తెలంగాణకు నికరజలాలతో పాటు..మిగులులో వాటా పెరగనుంది.

ఇటీవలే జరిగిన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం గోదావరిపైన కొత్త ట్రిబ్యునల్ వేసేందుకు సిద్దమని కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. ఇక గోదావరిలో ఇప్పటికే తెలంగాణ 956.98 టీఎంసీల నీటిని వినియోగించుకుంటోంది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రీ డిజైనింగ్ లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతమ్మ బరాజ్, సీతారామ లాంటి ప్రాజెక్టులతో తెలంగాణ నీటి వినియోగం మరింత పెరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మిగులు జలాల్లోనూ 600 టీఎంసీలకు పైగా వాటా కావాలని ఇప్పటికే కేంద్రం ముందు తెలంగాణ ప్రతిపాదన పెట్టింది. అన్ని సబ్ బేసిన్లలోని మిగులు జలాలను ఉమ్మడి ఏపీ వాడుకోవచ్చని బచావత్ అవార్డులో పొందుపర్చిన వాస్తవాన్ని కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో ఉదహరించింది. కేంద్రం కొత్త ట్రిబ్యునల్ వేయడం ద్వారా నీటి లభ్యతపై శాస్త్రీయంగా స్పష్టత రావడంతో పాటుప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయించుకునేందుకు వీలవుతుందని సాగునీటి రంగ నిపుణులు, అధికారులు విశ్లేషిస్తున్నారు.

కృష్ణాబేసిన్ లోని రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి రెండు సార్లు శాస్త్రీయ సర్వే జరిగింది. 75 శాతం డిపెండబులిటీపై 2130 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేల్చిన బచావత్ ట్రిబ్యునల్..ఆ మేరకు కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ మధ్య నీటి పంపిణీని చేపట్టింది. తర్వాత వచ్చిన బ్రిజేష్ ట్రిబ్యునల్ సమయంలోనూ 65 శాతం డిపెండబులిటీపై 2578 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేల్చి..ఈ మేరకు బచావత్ కేటాయింపుల కంటే ఎక్కువగా ఉన్న నీటిని మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేశారు. అయితే గోదావరిలో ఇలాంటి శాస్త్రీయ సర్వే కానీ, పంపకాలు గానీ నేటికి జరగలేదు. కేంద్రం ఏర్పాటు చేయనున్న కొత్త ట్రిబ్యునల్ తో ఈ గందరగోళానికి తెరపడనుందని భావిస్తున్నారు. 1969లో కృష్ణా, గోదావరి కమిషన్ సమయంలో కృష్ణా, గోదావరి రెండింటికి వేర్వేరు ట్రిబ్యునల్ వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ముందుగా కృష్ణా జలాల పంపకాలపై దృష్టి సారించి..ఓ కొలిక్కి వచ్చాక పదేండ్లకు అంటే 1979లో గోదావరిపై అవార్డు రూపొందించారు. అయితే ఈ బేసిన్ లోని మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఉమ్మడి ఏపీ మధ్య ఎలాంటి విభేదాలు లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో జరిగిన జల ఒప్పందాలను క్రోడీకరించి వాటికే ఆమోద ముద్ర వేశారు. కానీ కృష్ణాలో మాదిరిగా శాస్త్రీయంగా గోదావరి జలాల నీటి లభ్యతపై శాస్త్రీయ సర్వే జరిపి పంపకాలు జరిపిన దాఖలాల్లేవు. 1969లో ట్రిబ్యునల్ వేసినప్పుడు అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలు ఇవ్వగా..తర్వాత పదేండ్లలోపే అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త ప్రాజెక్టులు రావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...