20.4 C
Hyderabad
Sunday, January 24, 2021

నాలుగో రోజు వరద ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. రాజేంద్రనగర్ లో పర్యటించిన మంత్రి వరదల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఐదు లక్షల రూపాలయ ఎక్స్ గ్రేషియా చెక్కులను అందించారు. వరదల వల్ల ప్రాణనష్టం జరగడం బాధాకరమన్నారు. ప్రాణనష్టం అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించిందన్నారు. వర్షాలు తగ్గుముఖం పటట్డంతో ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వైద్యం ఇతర తక్షణ సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. అంటురోగాలు వ్యాపించకుండా పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. భారీవర్షాలకు తెగిన గగన్ పహడ్ అప్పా చెరువును కేటీఆర్ పరిశీలించారు. చెరువు కట్టకు  వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు రంజిత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మేయర్ బొంతురామ్మోహన్.. కేటీఆర్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

- Advertisement -

Latest news

Related news

తమిళ చరిత్ర మోదీకి అర్థం కాదు.. రాహుల్

భార‌త్‌లో ఒకే భాష‌, ఒకే సంస్కృతి, ఒకే ఐడియా ఉండాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ న‌మ్ముతార‌ని రాహుల్ గాంధీ విమర్శించారు. యావ‌త్ దేశం ఒకే ఒక వ్య‌క్తిని పూజించాల‌ని ప్ర‌ధాని...

త్వరలోనే కొత్త ఐటీ పాలసీ.. కేటీఆర్

తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు అందించిందని, త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఐటీ పాలసీకి త్వరలో...

స్టేజీపైనే కుప్పకూలిన ప్రదీప్ డైరెక్టర్

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. జనవరి 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రెస్ మీట్...

తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు...