ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉప-ఎన్నికలో వార్ వన్ సైడ్ అయ్యింది. స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. రెండు జాతీయ పార్టీల ఓట్లు కలిపినా డిపాజిట్లు దక్కపోవడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ చరిత్రలోనే అత్యంత భారీ మెజార్టీతో కవిత గెలిచి రికార్డు సృష్టించారు.
ఎన్నికలేవైనా టీఆర్ఎస్ దే విజయం అన్నది మరోసారి రుజువైంది. బీజేపీ మోసపు మాటలు, మాటలే తప్ప చేతలు లేని కాంగ్రెస్ కు తగిన శాస్తి జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప-ఎన్నికలో గులాబీ జెండా సగర్వంగా ఎగిరింది. టీఆర్ఎస్ అభ్యర్థి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గ్రాండ్ విక్టరీ సాధించారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆమెకు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. రెండు జాతీయ పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చిత్తుగా ఓడిపోయారు. నిజామాబాద్ జిల్లా చరిత్రలో అత్యంత భారీ మెజార్టీతో గెలిచి కవిత రికార్డు సృష్టించారు.
ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఓటింగ్ ఏకపక్షంగా సాగింది. విజయానికి అవసరమైన ఓట్లను కవిత మొదటి రౌండ్లోనే సాధించారు. తొలి రౌండ్లోనే భారీ ఆధిక్యంతో గెలిచారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్ లో 600 ఓట్లు లెక్కించగా కవితకు 531 ఓట్లు పోల్ అయ్యాయి. లక్ష్మినారాయణకు 39, సుభాష్ రెడ్డికి 22 ఓట్లు పడ్డాయి. ఇందులో 8 చెల్లని ఓట్లు ఉన్నాయి. అటు రెండో రౌండ్ లోనూ కవితదే ఆధిపత్యం కొనసాగింది. మొత్తం 223 ఓట్లు లెక్కించగా కవితకు 197 ఓట్లు పడ్డాయి. లక్ష్మినారాయణకు 17, సుభాశ్ రెడ్డికి 7, రెండు చెల్లని ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో మొత్తం 823 ఓట్లకు గాను టీఆరెస్ అభ్యర్థి కవితకు 728 పోల్ అయ్యాయి. ఇందులో పోస్టల్ ద్వారా వచ్చిన రెండు ఓట్లు కూడా ఉన్నాయి. అటు రెండు రౌండ్లు కలిపి బిజెపి అభ్యర్థి లక్ష్మీ నారాయణకు 56 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు పడ్డాయి. 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఐతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో నిజామాబాద్ చరిత్రలో కవితదే భారీ మెజార్టీ.
ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప-ఎన్నికలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఓట్లు కలిపినా డిపాజిట్లు దక్కపోవడం.. ఆ పార్టీలపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నది. ప్రజలు, ప్రజాప్రతినిధులు కవిత నాయకత్వాన్ని కోరుకుంటున్నారనడానికి ఈ గెలుపు మరో నిదర్శనం.