19.8 C
Hyderabad
Friday, December 4, 2020

నిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను వైద్యులు ప్రారంభించారు. ఇద్దరు వాలంటీర్లకు కొవాగ్జిన్‌ అనే వ్యాక్సిన్‌ను నిమ్స్‌ వైద్యులు ఇచ్చారు. స్వదేశీ కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ రూపొందించింది. 

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’ పేరిట టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఈ వ్యాక్సిన్‌పై మొదటి, రెండో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు ఇండియన్‌ డ్రగ్‌ రెగ్యులేటరీ అనుమతులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 375 మంది వలంటీర్లపై మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్టు సంస్థ శుక్రవారం ప్రకటించింది.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...