23.2 C
Hyderabad
Sunday, September 20, 2020

నియంత్రిత సాగుపై నేడు సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నియంత్రిత పంటలసాగు కోసం రైతులను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నియంత్రిత సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కొవిడ్‌-19 వైరస్‌ నియంత్రణ, లాక్‌డౌన్‌ సడలింపులు, తెలంగాణ అవతరణ వేడుకలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో వివిధశాఖల అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమవుతారు. ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేస్తామని రాష్ట్రంలో ఇప్పటికే అనేకచోట్ల గ్రామాలకు గ్రామాలే మూకుమ్మడిగా తీర్మానాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను మరింత ప్రోత్సహించేలా ఏంచేయాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రోహిణి కార్తె ప్రారంభంతో వానకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేలా అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచనలు చేయనున్నారు. 

కరోనా వైరస్‌ నియంత్రణపై సమీక్ష

రాష్ట్రంలో కొవిడ్‌-19 వైరస్‌ నియంత్రణ, లాక్‌డౌన్‌ పరిస్థితులను సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు. వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, లాక్‌డౌన్‌ అమలుపై అధికారులతో చర్చిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతుండటంతో వైరస్‌ నియంత్రణకు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అలాగే జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై కూడా అధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చిస్తారు.

- Advertisement -

Latest news

బకాయిలను వెంటనే విడుదల చేయండి: కేటీఆర్

తెలంగాణకు నిధుల విడుదల విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది....

Related news

బకాయిలను వెంటనే విడుదల చేయండి: కేటీఆర్

తెలంగాణకు నిధుల విడుదల విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది....

అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి కేటీఆర్

పేద దేశాల్లో క్రైస్త‌వ మిష‌న‌రీలు అందిస్తున్న సేవ‌లు మ‌రువ‌లేనివి అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో బిష‌ప్‌లు, క్రైస్త‌వ ప్ర‌ముఖుల‌తో ఏర్పాటు చేసిన...

నేరెడ్‌మెట్ లో‌ విషాదం…

నగరంలోని నేరెడ్‌మెట్‌లో నిన్న సాయంత్రం బాలిక అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదాంతంగా మారింది. సుమేధ‌(12)‌ అనే బాలిక నిన్న సాయత్రం 7 గంటల నుంచి కనిపించకుండా పోయింది. ప్ర‌మాద‌వ‌శాత్తు నాలాలో ప‌డిన...

బీహార్‌ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో పలు జిల్లాలు నీట మునిగాయి. వరద ఉదృతి పెరగడంతో కిషన్‌గంజ్‌లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభానికి...