26.4 C
Hyderabad
Monday, October 26, 2020

నియంత్రిత సాగు..రైతన్నబాగు : మంత్రి అల్లోల

అదిలాబాద్ : దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం అమలు చేస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో జరిగిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సులోముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులందరూ నియంత్రిత విధానం వైపు మొగ్గుచూపేలా యంత్రాంగం కృషి చేయాలన్నారు.  రైతులు  ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. 

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిన ఏకైక రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు రుణమాఫీ చేసి అన్నదాతల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. పత్తి విత్తనాలు సరిపడా ఉన్నాయి. కరోనా వల్ల  ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సోయా విత్తనాల కొరత ఉన్నపటికీ, రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్ నాందేవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...