18 C
Hyderabad
Friday, November 27, 2020

నూతన ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీ విడుదల

భవిష్యత్ అవసరాలు తీర్చే రంగాలపై దృష్టిపెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తోంది. ఉత్పత్తి, వినియోగాన్ని పెంచేలా ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం రూపొం‌దిం‌చిన నూతన ఎల‌క్ర్టిక్‌ వెహి‌కిల్‌ (ఈవీ) పాల‌సీని ఐటీ, పరి‌శ్ర‌మల శాఖ మంత్రి కేటీఆర్, రవా‌ణా‌శాఖ మంత్రి పువ్వాడ అజయ్ క‌లిసి శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని మర్రి చెన్నా‌రెడ్డి మానవ వన‌రుల కేంద్రంలో తెలం‌గాణ ఈవీ సమ్మి‌ట్‌లో పాల‌సీ విధానాన్ని ప్ర‌క‌టించారు. రాష్ర్టాన్ని ఎల‌క్ర్టిక్ వాహ‌నాల హ‌బ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో ఈ నూత‌న విధానాన్ని ప్ర‌క‌టించారు. ఎల‌క్ర్టిక్ వాహ‌నాలు, ఇంధ‌న నిల్వ‌ల‌కు కొత్త విధానం అమ‌లు చేయ‌నున్నారు. 2020-2030 వ‌ర‌కు ఎల‌క్ర్టిక్ వాహ‌నాల త‌యారీ, వినియోగంపై విధాన‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. 

పాలసీ విడు‌దల కార్య‌క్ర‌మంలో నీతి ఆయోగ్‌ సీఈవో అమి‌తా‌బ్‌‌కాంత్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎండీ పవ‌న్‌‌కు‌మార్‌ గోయెంకా, ఐటీ శాఖ ముఖ్య కార్య‌దర్శి జయే‌శ్‌‌రం‌జన్‌, టీఎ‌స్‌‌ఐ‌ఐసీ ఎండీ ఈవీ నర్సిం‌హా‌రెడ్డి, ఎస్‌ బ్యాంకు చైర్మన్‌ సునీల్‌ మెహతా తది‌త‌రులు పాల్గొన్నారు. 

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...