26.4 C
Hyderabad
Monday, October 26, 2020

నేడు బయోడైవర్సిటీ వద్ద మరో ఫ్లైఓవర్‌ ప్రారంభం

హైదరాబాద్ ఐటీ కారిడార్ వాసులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త తెచ్చింది. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనదారులకు ఇక ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. బయోడైవ‌ర్సిటీ జంక్ష‌న్‌లో నిర్మించిన ఫ‌స్ట్ లెవ‌ల్ ఫ్లైఓవర్ ను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

ఎస్‌ఆర్‌‌డిపి ప్యాకేజి-4 కింద రూ.379 కోట్ల అంచ‌నా వ్యయంతో చేప‌ట్టిన..‌ జెఎన్‌టియు నుంచి బ‌యోడైవ‌ర్సిటీ వ‌ర‌కు 12 కిలోమీట‌ర్ల కారిడార్ ప‌నులు మొత్తం పూర్త‌య్యాయి. ఈ ప్యాకేజిలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు ఐదు ప‌నుల‌ను ప్రారంభించుకొని.. ప్ర‌జ‌ల వినియోగంలోకి తెచ్చారు. మైండ్ స్పేస్ అండ‌ర్ పాస్‌, మైండ్‌స్పేస్ ఫ్లైఓవ‌ర్‌, అయ్య‌ప్ప సొసైటి జంక్ష‌న్ అండ‌ర్ పాస్‌, రాజీవ్‌గాంధీ జంక్ష‌న్ ఫ్లైఓవ‌ర్, బ‌యోడైవ‌ర్సిటీ జంక్ష‌న్ లెవ‌ల్ -2 ఫ్లైఓవ‌ర్ల‌ను గ‌తంలోనే అందుబాటులోకి వచ్చాయి.

బయోడైవ‌ర్సిటీ జంక్ష‌న్‌ ఫ‌స్ట్ లెవ‌ల్ ఫ్లైఓవర్ తో గ‌చ్చిబౌలి నుంచి మెహిదీప‌ట్నం వైపు రాయ‌దుర్గ్ వెళ్లే వాహ‌న‌దారుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. ఈ ఫ్లైఓవ‌ర్ పొడ‌వు 690 మీట‌ర్లు, వెడ‌ల్పు 11.50 మీట‌ర్లు. మూడు లేన్ల ఈ ఫ్లైఓవ‌ర్‌పై ఒకే వైపు వాహ‌నాల‌ను అనుమతి ఉంది. ఫ్లై ఓవర్‌పై అత్యాధునిక కెమెరాలు, స్పీడ్‌ గన్స్‌, స్పీడ్ కంట్రోల్  బోర్డులు ఏర్పాటు చేశారు. అటు ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నట్లు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...