27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

నేతన్నకు 93 కోట్లు..26,500 మంది కార్మికులకు లబ్ధి

  • 26,500 మంది కార్మికులకు లబ్ధి 
  • లాక్‌ఇన్‌ పీరియడ్‌ కంటే ముందే పొదుపు సొమ్ము విడుదల 
  • కార్మికులది 31 కోట్లు, సర్కారు సాయం 62 కోట్లు
  • 50 వేల నుంచి 1.25 లక్షలు అందుకోనున్న కార్మికులు
  • చేనేత, జౌళిశాఖపై మంత్రి కేటీఆర్‌ సమీక్షలో నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్నకు చేయూత పొదుపు పథకంలో లాక్‌ఇన్‌ పీరియడ్‌ ముగియకున్నా, డబ్బు తిరిగి తీసుకొనేందుకు అనుమతివ్వనున్నట్టు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ నిర్ణయంతో చేనేత కార్మికులకు తక్షణం రూ.93 కోట్లు చేతికందుతాయి. ఇందులో కార్మికుల పొదుపు సొమ్ము రూ.31కోట్లు ఉండగా, ప్రభుత్వ సాయం రూ.62 కోట్లు ఉన్నది. 

సర్కారు రెట్టింపు సాయం..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో వ్యాపారాలు స్తంభించటంతో చేనేత కార్మికులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. దాంతో నేతన్నలవద్ద నగదును పెంచేందుకు ఈ పథకం ద్వారా నగదుసాయం అందిస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. శనివారం టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో చేనేత, జౌళిశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. నేతన్నకు చేయూత పొదుపు  పథకంలో కార్మికుడు చేరిననాటి నుంచి మూడేండ్లు లాక్‌ఇన్‌ పీరియడ్‌ ఉంటుందని, అయితే ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే నగదు అందుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. దాంతో నేతన్నలకు రూ.93 కోట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.  

‘ఈ పథకంలో చేరిన చేనేతకార్మికుడు ఎనిమిదిశాతం (నెలకు రూ.1200) తన వాటా జమ చేస్తే, దానికి రెట్టింపు 16 శాతం (నెలకు రూ.2400) ప్రభుత్వ వాటాగా జమ చేస్తున్నది. పవర్‌లూం కార్మికుల ఎనిమిదిశాతం వాటాకు సమానంగా మరో ఎనిమిదిశాతం ప్రభుత్వం జమ చేస్తున్నది. ఈ పథకానికి మూడేండ్లు లాకిన్‌ పీరియడ్‌ ఉంది. ఇప్పటివరకు కార్మికులు సుమారు రూ. 31 కోట్లు జమ చేస్తే ప్రభుత్వవాటాగా రూ.62 కోట్లు జమచేసింది. లాక్‌ఇన్‌ పీరియడ్‌ నుంచి మినహాయించటం ద్వారా ఈ పథకంలో భాగస్వాములైన 26,500 మంది నేతన్నలకు తక్షణమే ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు నగదు అందుతుంది’ అని కేటీఆర్‌ తెలిపారు. దీంతోపాటు సొసైటీల పరిధిలోని 2337 మంది కార్మికులకు గతంలో ముగిసిన పొదుపు పథకం డబ్బు మరో రూ.1.18 కోట్లు నేత కార్మికులకు అందించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

చేనేత కార్మికులను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు

చేనేత కార్మికులకు తక్షణం నగదు అందుబాటులోకి వచ్చేలా నేతన్నకు చేయూత పథకం కింద రూ.93 కోట్లు విడుదల చేయడంపై ఆప్కో మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు హర్షం వ్యక్తంచేశారు. కష్టకాలంలో కార్మికులను ఆదుకున్నందుకు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతులు తెలిపారు. అదేవిధంగా చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోయిన నిల్వలను కొనుగోలుచే చేయాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

పార్క్‌ల పురోగతిపై… 

బతుకమ్మ చీరల ఉత్పత్తి ప్రక్రియ పురోగతి, వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌తోపాటు హైదరాబాద్‌ ఫార్మా సిటీ పనుల పురోగతిని కూడా మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర పరిశ్రమలపై విభాగాలవారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజ రామయ్యార్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, టీఎస్‌ఐఐసీ సీఈవో మధుసూదన్‌, టెస్కో జీఎం యాదగిరి, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తినాగప్పన్‌, ఏరోస్పేర్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...