పబ్జీ ఆటకు తిరుపతిలో ఓ యువకుడు బలయ్యాడు. రాత్రి పగలు తేడా లేకుండా పబ్జీ ఆడుతూ గడుపుతున్న తేజేష్ అనే యువకుడు రాత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. గత కొంత కాలంగా పబ్జీ ఆడుతూ వింతగా ప్రవర్తిస్తున్న తేజేష్ ను తల్లిదండ్రులు పలుసార్లు మందలించినా మళ్ళీ అదేబాట పట్టాడు. ఈ క్రమంలోనే పబ్జీకి బలయ్యాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తేజేష్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. కొద్ది నెలలుగా తేజేష్ పబ్జీకి బానిసైనట్లు గుర్తించారు