21.7 C
Hyderabad
Friday, January 22, 2021

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఆయనకు భారతరత్న ఇస్తామంటూ 2014 ఎన్నికల ప్రచారంలోనే ప్రధాని నరేంద్రమోదీ వాగ్దానం చేశారు. మాటిచ్చి ఆరేండ్లు దాటింది. మోదీ రెండోసారి కూడా గద్దెనెక్కారు. అయినా ఆ ఊసే లేదు. కానీ పీవీని కేంద్రం విస్మరించినా..సీఎం కేసీఆర్ మాత్రం పీవీ శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఏడాదిపొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన రచనలను ప్రచురిస్తున్నారు. ఆయన స్మారకాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజియం పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానించి.. కేంద్రాన్ని కోరారు. కానీ బీజేపీ నేతలకు మాత్రం ఇవేవీ పట్టలేదు. ఎన్నికలు వచ్చేసరికి ఓట్లురాల్చే బొమ్మలుగా ఆ మహానుభావుడు కనిపించారు. చటాక్‌ పూలు తెచ్చి.. కిలో ఓట్లు కొల్లగొట్టాలని చూశారు. బీజేపీ, టీడీపీ రెండు పార్టీలుకూడా రాజకీయంగా పీవీ ఖ్యాతిని వాడుకొన్నాయి. ఇప్పుడు పీవీ ఘాట్‌ కు తానే సంరక్షకుడన్నట్టుగా సీన్‌ క్రియేట్‌చేశారు.

జాతిసిగలో తెలుగు ఆత్మగౌరవాన్ని నెలవంకగా మలచిన మహానాయకుడు ఎన్టీ రామారావు. ఎన్టీఆర్‌ నటసార్వభౌముడే కాదు దక్షిణాది రాజనీతిని జగద్విఖ్యాతం చేసిన నాయకుడు. చలనచిత్ర రంగంలో రారాజుగా.. ముఖ్యమంత్రిగా పేద ప్రజల అన్నంగిన్నెగా మారిన ఆరాధ్యుడు. ప్రాంతీయ పార్టీలకు వేగుచుక్కగా మారి నేషనల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి న ధీశాలి. పీవీ నరసింహారావు లోక్‌సభకు పోటీచేయాల్సిన అనివార్యత నెలకొన్నప్పుడు ‘దేశ ప్రధానిగా ఇన్నాళ్లకు ఒక తెలుగుబిడ్డకు అవకాశం వస్తున్నదని…. ఇటువంటి తరుణంలో ఆ మహోన్నత అవకాశానికి పోటీదారుడిగా నిలబెట్టడం నాకు ఇష్టం లేదని ప్రకటించారు.  నంద్యాల లోకసభ ఉప ఎన్నికల్లో తన పార్టీ నుంచి అభ్యర్థిని బరిలో నిలపకుండా పార్టీలకు అతీతంగా రాజనీతిని ప్రదర్శించారు. తన రాజకీయ పార్టీ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించి ఎంతోమందిని రాజకీయ అరంగేట్రం చేయించిన ముందుచూపున్న నేత. ఎన్టీయార్‌ని ఈ దేశం ఎన్నటికీ మరచిపోదు. అటువంటి మహానటుడు.. మహానాయకుడిగా ఎన్టీయార్‌ చేసిన సేవల గుర్తుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఎంతోకాలంగా ప్రపంచవ్యాప్తంగా వినతులు వస్తున్నాయి. సమాధుల వద్ద పునాదులను కాపాడతామని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్న బీజేపీ నేతలకు నిజంగా ఎన్టీఆర్‌ మీద ప్రేమే ఉంటే ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలుగు సమాజం డిమాండ్‌ చేస్తోంది. 

ఎంఐఎం నేత ఏవో పిచ్చిమాటలు మాట్లాడంగనె.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఒక్కసారిగా మాజీ ప్రధాని పీవీ, మాజీ సీఎం ఎన్టీఆర్‌ గుర్తుకొచ్చారు. వందిమాగధులను వెంటేసుకొనిపోయి ఇద్దరి సమాధులపై నాలుగు పూలు చల్లివచ్చారు. జీవితంలో ఎన్నడూ అటువైపు తొంగిచూడని బీజేపీ నేతకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల గడపలో ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది.దీనిపై జనం మండిపడుతున్నారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...