28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ గత ఐదేండ్లలో పెట్టుబడులకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారింది. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో పరిశ్రమల శాఖ దినదినాభివృద్ధి చెందుతోంది. ఎప్పటిలాగే ఈ యేడు కూడా.. పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తో కలిసి ప్రగతిభవన్‌ లో ఇందుకు సంబంధించిన నివేదికను ఆవిష్కరించారు. జాతీయ జీఎస్‌డీపీ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు మంత్రి కేటీఆర్‌. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా గత ఏడాది నమోదైన 4.55 శాతంతో పోలిస్తే .. 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదయిందన్నారు. తలసరి ఆదాయం విషయంలోనూ జాతీయ సగటు లక్షా 34 వేల 432 రూపాయలతో పోల్చినప్పుడు..  తెలంగాణ తలసరి ఆదాయం రెండు లక్షల 28 వేల 216 రూపాయలుగా నమోదైందని మంత్రి అన్నారు. దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందని చెప్పారు. ఈ నివేదికలో పలు అంశాల వారీగా పరిశ్రమల శాఖ సాధించిన ప్రగతిని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక టీఎస్‌ ఐపాస్‌ విధానం తెలంగాణకు అద్భుతమైన ఫలితాలను అందించింది. ముఖ్యంగా ఈఓడిబి ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు అవకాశం కల్పించిందన్నారు మంత్రి కేటీఆర్‌. ఇప్పటి దాకా వచ్చిన పెట్టుబడుల మొత్తం సంఖ్య రూ. 1 లక్షా96 వేల 404 కోట్లుగా నమోదైందన్నారు. ఇప్పటిదాకా అనుమతులు పొందిన 12,021 పరిశ్రమల్లో.. 75 శాతానికి పైగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో సుమారు 45 వేల 848 కోట్ల పెట్టుబడులు తెలంగాణకి మెగా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయని, తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ఇక భారతదేశంలోనే అత్యధికంగా నెట్ ఆఫీస్

అబ్సార్‌ప్షన్‌ విషయంలో హైదరాబాద్.. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్ నగరం జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా మరోసారి ప్రథమ ర్యాంకు సాధించినన్నారు. బెస్ట్ పర్ఫామింగ్ స్టేట్ గా నీతిఅయోగ్ ద్వారా.. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్‌ లో  ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభంలోనూ.. తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయన్నారు. కరోనా రిలీఫ్ ఫండ్ కోసం సుమారు 150 కోట్ల రూపాయలకు పైగా నిధులను లేదా ఇతరత్రా కాంట్రిబ్యూషన్ రూపంలో అందించారన్నారు.

ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా హైదరాబాద్ ఫార్మా మరియు లైఫ్ సైన్స్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకొని జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో  తన వాటాను 35 శాతంగా కోనసాగించింది. ప్రస్తుతం సుమారు ఎనిమిది వందల ఫార్మా, బయోటెక్, మెడికల్ టెక్నాలజీ కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటి ఎంటర్‌ ప్రైజ్‌ వ్యాల్యూ 50 బిలియన్ డాలర్లుగా ఉన్నది. రానున్న దశాబ్దకాలంలో దీని విలువను 100 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతోపాటు నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నోవార్టిస్ తన డిజిటల్ ఇన్నోవేషన్ హబ్ ను హైదరాబాద్‌ లో ప్రారంభించింది. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ పరిశ్రమకు.. smt కంపెనీ పునాది వేసింది. 250 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో మెడికల్ డివైస్ పార్క్ లో ఈ పరిశ్రమ రానున్నది. దీని ద్వారా 1500 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. సింజిన్ కంపెనీ జీనోమ్ వ్యాలీలో 170 కోట్ల రూపాయలతో తన పరిశ్రమను స్థాపించింది. లక్షా 80 వేల స్క్వేర్ ఫీట్ లతో వివిధ కంపెనీలను ఒకేచోట చేర్చేందుకు 100 కోట్ల రూపాయల పెట్టుబడితో యంయన్ పార్క్ బిల్డింగ్ కోసం జినోమ్ వ్యాలీలో ఫౌండేషన్ స్టోన్ పడింది. అటు హైదరాబాద్ కి దగ్గర్లో ఉన్న జీనోమ్ వ్యాలీ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికి 200 కంపెనీలతో సుమారు 10 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈసారి శాండజ్, సింజిన్, టీసీఐ కెమికల్స్, యాపన్ బయో, వల్లర్క్ ఫార్మా లాంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. మెడికల్ డివైస్ పార్క్ లో సుమారు 25 కంపెనీలు తమ కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం నిమ్జ్ గుర్తింపునిచ్చింది.

ఇక హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్‌ పోర్టు ప్రపంచంలోనే మూడవ గ్రోయింగ్ ఎయిర్ పోర్టుగా అవార్డు అందుకుంది. నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ సుమారు ఐదు డిఫెన్స్ ప్రాజెక్టులను హైదరాబాద్ తీసుకురావడం ద్వారా ఆరు వందల మందికి ఉపాధి కల్పించింది. రెండు లక్షల 40 వేల చదరపు అడుగులతో 350 కోట్ల రూపాయలతో జిఎంఆర్ బిజినెస్ పార్క్ ని శంషాబాద్ లో ఏర్పాటు చేస్తున్నది. అటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సుమారు ఏడు ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఒక మెగా ఫుడ్ పార్క్ కార్యకలాపాలు.. మూడు వందల కోట్ల రూపాయలతో ప్రారంభమయ్యాయి. మరో మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు పనులు ప్రారంభించాయి.

సిరిసిల్లలో 60 ఎకరాలతో అప్పారెల్ పార్క్ ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. దీంతో పాటు సిరిసిల్లలో మరో వీవింగ్ పార్క్ ను ప్రభుత్వం డెవలప్‌ చేస్తుంది. 88 ఎకరాల్లో 50 ఇండస్ట్రియల్ షెడ్ల నిర్మాణం చేయడంతో 4416 పవర్‌ లూమ్‌ లు, 60 వార్పిన్ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక కాకతీయ మెగా టెక్స్‌ టైఐల్‌ పార్క్ లో సుమారు 960 కోట్ల రూపాయలతో 300 ఎకరాల్లో తమ కంపెనీని పెట్టేందుకు యంగ్ వన్ కంపెనీ.. ప్రభుత్వంతో తుది దశ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. తద్వారా 12 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చందన్వెళ్లి లో వెల్ స్పన్ గ్రూపు.. రూ 1150 కోట్లతో కేవలం 14 నెలల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. తద్వారా వేయి మందికి ఉపాధి లభించింది. గణేశా ఈకోస్పియర్ కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్క్ లో.. రూ. 327 కోట్లతో..  30 ఎకరాల్లో 1000 మందికి ఉపాధి ఇచ్చేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నేతన్నకు చేయూత ద్వారా 50 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. తద్వారా 20,298 మంది  నేతన్నలకు లబ్ది కలిగింది. చేనేత మిత్ర ద్వారా 36 వేల 233 మంది చేనేత కార్మికులకు లబ్ధి కలిగింది

ఇక రిటైల్‌ రంగంలో చూస్తే 20 వేల చదరపు ఫీట్లతో గచ్చిబౌలిలో తెలంగాణ లోనే అతి పెద్ద అమెజాన్ లార్జెస్ట్ డెలివరీ సెంటర్ స్టార్ట్ చేసింది. అమెజాన్‌ కు రాష్ట్రంలో ఇప్పటికీ 3.2 మిలియన్ల క్యూబిక్ ఫీట్ల స్టోరేజీ కలిగిన మూడు ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లు ఉన్నాయి. తెలంగాణలో వాల్ మార్ట్ తన 5వ స్టోర్ ను వరంగల్‌ లో ప్రారంభించింది. అటు కేంద్ర ప్రభుత్వం వరంగల్ తో పాటు హైదరాబాద్ నగరానికి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కేటాయించింది.

- Advertisement -

Latest news

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

Related news

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...

24 గంటల్లో 22,752 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 22వేల752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...

జమ్మూకశ్మీర్‌ లో భూకంపం… రిక్టర్‌ స్కేల్‌ పై 4.3గా నమోదు

జమ్మూకశ్మీర్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా భూ ప్రకంపనలతో భయాందోళనకు గురవుతుంటే తాజాగా తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై...