కరోనా వైరస్ పార్లమెంట్ ను కలవరపెడుతోంది. ఇప్పటికే 25మంది ఎంపీలు, సహా 50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో పెద్దల సభ వణికిపోతోంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 14 మంది రాజ్యసభ ఎంపీలు తమకు సెలవులు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమావేశాలకు హాజరు కాలేమంటున్నారు. ఇదిలా ఉంటే కరోనా బారిన పడినవారిలో 12మంది బీజేపీ ఎంపీలుండగా..వైసీపీ నుంచి ఇద్దరు,శివసేన, డీఎంకే, ఆర్ఎల్పీ తదితర పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ఉన్నారు.