రాష్ట్రంలోని పేదలు గౌరవంగా బతికేలా.. ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందచేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అసెంబ్లీలో పెన్షన్‌దారుల సమస్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ యేడాది పెన్షన్ల కోసమే ప్రభుత్వం 11 వేల 725 కోట్ల రుపాయలు కేటాయించిందన్నరు. ఆసరా పెన్షన్‌దారులు సీఎం కేసీఆర్‌ను పెద్ద కొడుకుగా భావిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. బీజేపీ నేతలు పెన్షన్లు కేంద్రమే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆసరా పెన్షన్ల కోసం కేంద్రం 210 కోట్లు మాత్రమే ఇస్తుందని.. అధికార పార్టీ సభ్యులు బీజేపీ నేతల ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నరు. రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులతో పాటు ఒంటరి మహిళలు, మరుగుజ్జులు, హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు, బీడీ కార్మికులు, పైలేరియా బాధితులకు ప్రభుత్వం పెన్షన్లను అందచేస్తుందన్నరు.