గ్రేటర్ పరిధిలో 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,272 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. పోలింగ్ విధుల్లో 45 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ పర్యవేక్షణకు 661 మంది జోనల్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.

దొంగ ఓట్లను నివారించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచారు. కరోనా దృష్ట్యా పోలింగ్ స్టేషన్ల దగ్గర కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్షా 20 వేల పీపీఈ కిట్లు సిద్ధంగా ఉన్నాయి. వృద్ధులు, వికలాంగులు, కరోనా రోగులకు ఎన్నికల సంఘం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. కొవిడ్ 19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందే శానిటైజ్ చేసి.. సిద్ధం చేస్తున్నారు.