కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప-ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత స్థానిక మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. కౌన్సిలర్లతో కాసేపు మాట్లాడి నిజామాబాద్ బయలుదేరారు. ఉదయం 9 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. అప్పట్నుంచి టీఆర్ఎస్, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. కోవిద్ నిబంధనలు అనుసరించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.