ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటామని ప్రకటించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు జరిగే దేశవ్యాప్త సమ్మెకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు భవన నిర్మాణ కార్మికులు మద్దతివ్వడం హర్షించదగిన విషయమని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగానే ప్రజల వద్దకు వెళ్లిందన్నారు. జిల్లాల వారీగా భవన నిర్మాణ కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగానికి ఢోకాలేదన్నారు. హైదరాబాద్ నగరం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు.