24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక పోలింగ్

రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసింది. ఎక్కడా ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. పోలింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 315 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు.

దుబ్బాకలో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. నియోజకవర్గంలోని మొత్తం లక్షా 98వేల 756 ఓటర్లకు గాను 82.6 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున ఓటేశారు. వృద్ధులు కూడా క్యూలైన్లలో ఓపికగా నిల్చుని ఓటేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పారు.   

ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కోవిడ్ తో బాధపడుతున్న ఓటర్లకు అవకాశం కల్పించారు. అందుకోసం ఈసీ  ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓటు వేసేందుకు వచ్చే కోవిడ్ రోగులకు పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. దీంతో పీపీఈ కిట్లు ధరించి 11 మంది కరోనా బాధితులు ఓటుహక్కును వినియోగించుకున్నరు. ఇక మొదటి సారిగా దుబ్బాక ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. 80 సంవత్సరాలు పైబడినవారు, దివ్యాంగులు , కోవిడ్ రోగులు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారు.

ఉప ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుబ్బాక మండలంలోని తన స్వగ్రామం చిట్టాపూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ఓటేశారు. దుబ్బాక మండలం పోతారంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స్వగ్రామం పోతారంలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.

కరోనా ఉన్నప్పటికీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి హరీష్ రావు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ ను సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా..టీఆర్ఎస్ పై ప్రజలకు ప్రత్యేక అభిమానముందన్నరు హరీష్ రావు. సోషల్ మీడియాలో బీజేపీ, కాంగ్రెస్ సృష్టించిన హంగామాను ప్రజలే తిప్పికొట్టారని స్పష్టం చేశారు.

పోలింగ్ పూర్తయిన అనంతరం ఈవీఎంలను, వీవీ ప్యాట్లను దుబ్బాకలోని లచ్చపేటలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంనకు తరలించారు అధికారులు. ఈ నెల 10న సిద్దిపేట మండలం పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి.  

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...