17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలలోగా తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సహా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 315 పోలింగ్‌ బూతుల్లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్‌ శాతం నమోదైంది. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. 

- Advertisement -

Latest news

Related news

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...

అసోంవాసులను భయపెడుతున్న చిరుతలు

చిరుతలు అసోంవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాపంలోని తేజ్పూర్‌ యునివర్సిటీ సమీపంలో పట్టపగలే ప్రజలపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పులి జనం మీదకు విరుచుకుపడడంతొ...