19.3 C
Hyderabad
Monday, January 18, 2021

ప్రారంభమైన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున కల్వకుంట్ల కవిత పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 824 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.  నిజామాబాద్ జిల్లాలో 483 మంది, కామారెడ్డిలో 341 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 67 మంది ఓటర్లు ఉండగా, చందూర్ మండల పరిషత్లో అత్యల్పంగా నలుగురు ఓటర్లు ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 12న ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...