21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

ప్రైవేటు అసుపత్రుల పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్

కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ప్రతిపక్ష నాయకులు శాసనసభలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ప్రైవేటు ఆస్పత్రుల తీరును తప్పుబట్టారు. వీటిని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ పేషేంట్లకు జరుగుతున్న ట్రీట్మెంట్‌ను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు.. రాహుల్ బొజ్జ, సర్ఫరాజ్ అహ్మద్, డి. దివ్య సభ్యులుగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అమలవుతున్నాయా లేదా అని టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది. పేషేంట్లకు కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ప్రోటోకాల్స్ పాటిస్తున్నాయా లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తారు. ప్రైవేట్ ఆసుపత్రుల తీరును ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించనున్నారు. ఈ టాస్క్ ఫోర్స్‌ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సాంకేతిక సహకారం అందించనుంది.

అంతకుముందు శాసనసభలో కరోనా వైరస్‌ పై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తుందన్నారు. కరోనా విషయంలో కేంద్రాన్ని కూడా నిద్రలేపింది తెలంగాణ రాష్ట్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పనిచేసింది కాబట్టే మరణాల రేటు చాలా తక్కువ ఉందని చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయూష్మాన్‌ భారత్‌ ఎందుకు పనికిరాని పథకమని సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. దానికంటే ఆరోగ్య శ్రీ పథకం కవరేజీ బాగుందని చెప్పారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో కేంద్రం రాష్ట్రానికి చేసిన సహాయం ఏమీ లేదన్నారు.

ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇస్తే ప్రభుత్వం తప్పకుండా స్వీకరిస్తుందని సీఎం కేసీఆర్‌ మరోమారు స్పష్టం చేశారు.అంతేకానీ ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూడటం మంచి పద్దతి కాదన్నారు. ఇంతటి విపత్కర సమయంలోనూ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

- Advertisement -

Latest news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...