27.2 C
Hyderabad
Friday, December 4, 2020

బంగాళాఖాతంలో అల్పపీడనం….మరో రెండు రోజులు భారీ వర్షాలు

 

రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని  ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు మరో  రెండు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్‌, నిర్మల్, కొమురంభీం అసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

గతవారం రోజుల నుండి హైదరాబాద్‌ వాసులను వర్షం వీడడం లేదు.  బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ అమీర్ పేట, ఎర్రగడ్డ, మూసాపేట, అంబర్ పేట్  ఆఫ్జల్ గంజ్ , మంగళ్‌ హాట్ లో భారీ వర్షం పడింది. హయత్‌నగర్‌, ఎల్‌బినగర్‌, వనస్థలిపురంలో భారీ వర్షం కురిసింది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్‌ బాగ్,  సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేట్, కంచన్ బాగ్, చాంద్రయణగుట్ట, చత్రినాక,  లాల్ దర్వాజా, గౌలిపురాలో వర్షం పడింది. అటు మేడ్చల్ జిల్లా పరిధిలోనూ వర్షాలు పడ్డాయి. కీసర, ఘట్‌ కేసర్‌లో మోస్తరు వర్షం కురిసింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు పడ్డాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అటు వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి కొడంగల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా  కేంద్రంతో పాటు హాజీపూర్‌, నస్పూర్‌ మండలాల్లోనూ వాన పడింది.ఇక ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని బోథ్‌, ఇచ్చోడ, బజార్‌ హత్నూర్‌ మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది.  

మరోవైపు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని పలిమెల, మహాదేవ్‌పూర్‌, కాటారం, మహముత్తారం, మల్హర్‌ మండలాల్లో వర్షం కురిసింది.  పెద్దపల్లి జిల్లా  మంథని, రామగిరి, కమాన్ పూర్, ముత్తారం రామగుండం మండలాల్లో వర్షం పడింది.కరీంనగర్ జిల్లా కేంద్రం తో పాటు తిమ్మాపూర్, మనకొండూర్, గన్నేరువరం,శంకరపట్నం మండలాల్లో వర్షంకురిసింది. జగిత్యాల జిల్లాలోనూ వర్షాలు పడ్డాయి. జగిత్యాల, ధర్మపురి, గొల్లపల్లి, వెల్గటూర్‌,  పెగడపల్లి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇక ములుగు జిల్లా పరిధిలోని ఏటూరు నాగారం,  మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది.  

నిజామాబాద్ జిల్లా వర్ని, రుద్రూర్,కోటగిరి, చందూర్,మోస్రా మండల్లాలో వర్షం పడింది. ఇక కామారెడ్డిజిల్లా బాన్సువాడ,నర సుర్లబాద్,బీర్కూర్ మండలాల్లో మోస్తరు వర్షం పడింది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరులో మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా  సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం పడగా.. పఠాన్ చేరు, జహీరాబాద్ లో మోస్తరు వర్షాలు కురిసాయి.

మరో వైపు రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందన్నరు. దీని ప్రభావంతో  హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలపై ఉంటుందని తెలిపారు.

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముండడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు, వరదలతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా.. ముందుజాగ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజలు కూడా జాగ్రత్తగా  ఉండాలని ప్రభుత్వం సూచించింది.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....