21.4 C
Hyderabad
Friday, December 4, 2020

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు: కవిత

దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించారని జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఉండే పెద్ద మనస్సుతోనే ఇది సాధ్యం అయ్యిందని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన జాగృతి బుక్‌ క్లబ్‌ పేరును పీవీ బుక్‌ క్లబ్‌ గా మార్చామన్నారు. జాగృతి ఆధ్వర్యంలో ప్రతినెలా రెండు పీవీ క్లబ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.   పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లో పీవీ సమాలోచన సభ నిర్వహిస్తున్నారు. జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ నేత కవిత అధ్యక్షతన సాహితీ సౌరభం- అసమాన దార్శనికత అంశంపై జరుగుతున్న ఈ సభకు పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే కేశవరావు, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, కూతురు వాణీదేవి, రచయితలు అంపశయ్య నవీన్‌, కల్లూరి భాస్కరం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...