దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్ఓ సర్టిఫికేట్ ను ఆలయ కమిటీకి అందజేశారు. భక్తులకు వసతుల కల్పన, ప్రసాదం సంబంధించి, సాయిబాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం గొప్ప విషయమన్నరు ఎమ్మెల్సీ కవిత. దేవాలయల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు.
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని బాబాను కోరుకున్నట్లు కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, ఆలయ చైర్మన్ శివయ్య, ఐఎస్ఓ సర్టిఫికేషన్ మెంబర్ డా. విజయ రంగ పాల్గొన్నారు.