22.4 C
Hyderabad
Tuesday, October 27, 2020

బావిలో పడి నలుగురి మృతి

వరంగల్ రూరల్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలో గల ఓ బావిలో పడి నలుగురు మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న గీసుగొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో చిన్నారి, ఇద్దరు మహిళలు, ఓవ్యక్తి ఉన్నట్లుగా గుర్తించారు. మృతులంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారిగా నిర్దారించారు. బతుకు దెరువు కోసం ఇరవై ఏండ్ల క్రితం వరంగల్ కు వలస వచ్చిగోనె సంచుల పరిశ్రమలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...