22.4 C
Hyderabad
Tuesday, October 27, 2020

బీజేపీకి రాజకీయాలు చేయడం తప్పా..ప్రజల సంక్షేమం పట్టదు

కరోనా వైరస్‌ పై మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలుపెరుగని పోరాటం చేస్తోంది. కేంద్రం నుంచి పూర్తి మద్దతు రాకపోయినప్పటికీ.. వైరస్‌ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. అయినప్పటికీ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుండటంపై టీఆర్ఎస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించడంపై మంత్రి ఈటెల రాజేందర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. బీజేపీ పాలనలోని గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తున్నదని, దానిని మరుగునపెట్టి తెలంగాణపై విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. కరోనాను పట్టించుకోనిది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. విదేశాల్లో కరోనా విజృంభిస్తున్నవేళ మన దేశంలో ముందుజాగ్రత్తచర్యలు తీసుకోకుండా, ఇతర రాష్ర్టాల్లోని ప్రభుత్వాలను కూల్చే కుట్రలను బీజేపీ నేతలు కొనసాగించారని విమర్శించారు.

దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ ఆరోపించారు. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ రవాణాను నిలుపలేదని విమర్శించారు. కరోనా విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాటలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు.  కరోనా మరణాల శాతం జాతీయ స్థాయిలో 3.26 శాతం ఉంటే.. తెలంగాణలో 2.26 శాతం ఉన్నదని చెప్పారు.  కరోనా కట్టడిలో కేసీఆర్‌కు వస్తున్న పేరును చూసి తట్టుకోలేకనే బీజేపీ నేతలు విమర్శలకు దిగుతున్నారన్నారు. బీజేపీ నేతలు ఇంతటి క్లిష్ట సమయంలోనూ రాజకీయాలు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...