24.2 C
Hyderabad
Friday, January 22, 2021

బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

బీజేపీ నేతలు చేసిందేమీ లేదు కాబట్టే దేవుడి పేరుమీద రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆరేండ్ల నుంచి దేశంలో ప్రగతి కనిపిస్తలేదన్నారు. మోదీ సర్కార్‌ వ్యవస్థలన్నింటినీ శిథిలం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం ఎప్పుడు కనిపించని నేతలందరూ హైదాబాద్‌ కు వస్తున్నారన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా న్యాయవాదులు ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కరోనా సమయంలో.. వరదలప్పుడు ప్రజలకు అండగా నిలిచింది టీఆర్ఎస్‌ సర్కారే అని స్పష్టం చేశారు. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి డిసెంబర్‌ 1న జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్లే హైదరాబాద్ లో వ్యాపార రంగం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. 2014 లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 24 గంటల కరెంటు అందించడంతో వ్యాపారస్తులకు సైతం ఎంతో ‌మేలు‌ జరిగిందన్నారు.  గాంధీ నగర్ డివిజన్ లో జరిగిన ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.    ఆర్య వైశ్య సామాజిక వర్గం లోని పేదవారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని‌ చెప్పారు.  గత ఆరేండ్లుగా హైదరాబాద్ లో ఎంతో ప్రశాంత వాతావరణం నెలకొందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పుడు బీజేపీ నేతలు  రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హైదరాబాద్ కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆలోచించి  ఓటు వేయాలని కోరారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ ‌అభ్యర్థి‌ ముఠా పద్మ‌నరేష్ ను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తున్నదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, గాంధీనగర్ లో ఆర్టీసీ కార్మికుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు‌.   ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు గాను, 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అంతేకాదు ఉద్యోగుల సంక్షేమానికి‌ గాను, సమ్మెకాలపు జీతాల కోసం ఏకమొత్తంగా రూ.235 కోట్ల విడుదల చేశామన్నారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టడంతోపాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కృతనిశ్చయంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Latest news

Related news

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.